రైతు రుణమాఫీ “కాంగ్రెస్ విజయమే” : రేవంత్ రెడ్డి

-

ఈ రోజు ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మధ్యన రైతుల రుణమాఫీలకు సంబంధించి ప్రభుత్వం కీలాక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ వచ్చినా నిధులు కొరతగా ఉండడంతో రుణమాఫీని చేయలేదని చెప్పడం జరిగింది. ఆ రుణమాఫీని సీఎం ఆదేశంతో ఆగష్టు 3వ తేదీ నుండి అంటే రేపటి నుండి మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ విషయంపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పోరాటాలు , నిరసనలు మరియు ఉద్యమాలు చేయడం వలనే ఈ రోజు సీఎం కేసీఆర్ రుణమాఫీని ప్రకటించారు. అందుకే ఈ రుణమాఫీని పూర్తిగా కాంగ్రెస్ విజయం అంటూ గర్వంగా చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేయకపోతే బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించాకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు రేవంత్.

చేతకాని ప్రభుత్వం ఉండడం వల్లే అనవసరంగా నాలుగు సంవత్సరాలు రుణమాఫీ చేయించలేకపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version