తెలంగాణ ఎన్నికలు అప్పుడే : రేవంత్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు

-

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. అందరినీ షాక్ కు గురి చేస్తారు. ఇప్పటికే ఈటల రాజేందర్ బిజెపి పార్టీలో చేరిక పై మరియు టాలీవుడ్ డ్రగ్స్ కేసు పై సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ పై మరో బాంబు వేశారు. అలాగే ముందస్తు ఎన్నికలపై కూడా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంతర్గత తిరుగుబాటు ను ఎదుర్కొనేందుకే.. సిఎం కేసీఆర్ వరస మీటింగ్ లు పెట్టుకుంటున్నారని.. హుజూరా బాద్ ఎన్నికల ఫలితాల అనంతరం టిఆర్ఎస్ పార్టీ లో తిరుగుబాటు తప్పదని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. హరీష్ రావు మిత్ర ద్రోహి అని..   ఆయన రాజకీయ జీవితం ముగింపు కానుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

దళిత బందు ను ఎవరు వ్యతిరేకించలేదని.. పార్టీ ఎమ్మెల్యే లను భయ పెట్టేందుకే ముందస్తు లేదు… రెండున్నర ఏళ్ళు నేనే అధికారం లో ఉంటా అని హెచ్చరిస్తున్నారని కెసిఆర్ కు చురకలు అంటించారు. కేసీఆర్ కపట నాటక సూత్రధారి అని.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. యూపీ ఎన్నికల కు ఎంఐఐ తో సహా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని ప్రధాని మోడీ కి హామీ ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news