మంచి నిద్ర పొందాలంటే ఈ ఆహారపదార్ధాలు తీసుకోండి..!

-

ఆరోగ్యానికి మంచి పోషక ఆహారం ఎంత ముఖ్యమో మంచి నిద్ర sleeping కూడా అంతే ముఖ్యం. నిద్ర లేకపోతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా రోజువారీ పనుల్లో ఏకాగ్రత తగ్గుతుంది, ఉత్సాహం ఉండదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వాటి మీద నిద్ర ప్రభావం చూపిస్తుంది.

నిద్ర/ sleeping
నిద్ర/ sleeping

అయితే మంచి నిద్ర పొందాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే.. ఈరోజు నిపుణులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. మంచి నిద్ర పొందడానికి ఈ ఆహార పదార్థాలు నిద్రపోయే ముందు తీసుకుంటే మంచిదని అన్నారు. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే చూసేయండి.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..? అయితే తప్పకుండా ఈ ఆహార పదార్థాలను నిద్రపోయే ముందు తీసుకోండి. దీని వల్ల మీరు చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు.

బాదం:

బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. జ్ఞాపక శక్తి నుండి డయాబెటిస్ వరకు ఎన్నో ప్రయోజనాలని పొందొచ్చు. ప్రతి రోజు నిద్ర పోవడానికి ముందు మూడు నుండి నాలుగు బాదంని తినండి. బాదం లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మజిల్స్ రిలాక్స్ గా ఉంచుతుంది. దీనితో మీరు మంచి నిద్ర పొందొచ్చు.

పాలు, గసగసాలు:

నిద్రలేమి సమస్యలు తరిమికొట్టడానికి పాలు గసగసాలు బాగా ఉపయోగపడతాయి. పాలల్లో కొద్దిగా గసగసాల వేసుకుని నిద్రపోవడానికి అరగంట ముందు తాగితే ఒత్తిడి, నీరసం పూర్తిగా మాయం అయిపోయి మంచి నిద్ర పొందడానికి ఉపయోగపడతాయి.

అరటిపండు:

అరటి పండు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అరటి పండులో విటమిన్ బి6 ఉంటుంది. దీని కారణంగా మెలటోనిన్ హార్మోన్ పెరుగుతుంది. దీనితో బ్రెయిన్ కి నిద్ర పోవాలనే సిగ్నల్స్ ని పంపిస్తుంది. దీనితో మీరు హాయిగా నిద్ర పోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news