పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి

-

అభివృద్ధి ముసుగులో రైతుల ఉసురు తీయొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేటలో అభివృద్ధిపై నిర్లక్ష్యపు ధోరణి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగంగా లేఖ రాశారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి లేఖలో ఇలా పేర్కొన్నారు. అక్కంపేటలో మౌలిక వసతులు కూడా లేవన్నారు. ఆ గ్రామానికి రెవెన్యూ హోదా కూడా లేకపోవడం దుర్మార్గమన్నారు. టీఆర్ఎస్ కార్యక్రమాల్లో దళితబంధు అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పా.. దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు.

అలాగే వరంగల్ ఓఆర్ఆర్ కోసం హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాల్లో మొత్తం కలిసి 27 గ్రామాలు ఉన్నాయని, ఆ గ్రామాల్లో దాదాపు 21,517 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఓఆర్ఆర్ పేరుతో పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. లక్షల మంది రైతులు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఓఆర్ఆర్ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news