తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

-

తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే.. ఢిల్లీలో తెలంగాణ సిఎం కేసీఆర్ సేద తీరుతున్నాడని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సిఎం కేసీఆర్ డిల్లీ పర్యటన.. టిఆర్ఎస్, బిజేపి రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.

ఈ తీర్థ యంత్రాల తో రైతాంగానికి తెలంగాణ రాష్ట్రానికి కు అయ్యేది, పొయ్యేది ఏమి లేదని ఆగ్రహం వ్యాజహయం చేశారు. వానాకాలం పంట కొనకుండా యాసంగి పంట గురించి ఇప్పుడు పంచాయతీ ఏంది.. ? అని బహిరంగ లేఖలవి నిలదీశారు. టిఆర్ఎస్, బీజేపీ రాజకీయా చదరంగంలో రైతు పావుగా మారాడని ఆవేదన వ్యాఖ్యమ చేశారు రేవంత్ రెడ్డి. రైతాంగానికి అండగా నిన్న, నేడు, రేపు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news