విశాఖ యువ‌కుడి ఇడ్లీల‌కు ఉప‌ రాష్ట్ర‌ప‌తి ఫిదా..!

విశాఖ యువ‌కుడి ఇడ్లీల‌కు రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఫిదా అయ్యారు. విశాఖపట్నానికి చెందిన చిట్టం సుదీర్ అనే యువకుడు తోపుడు బండిపై ఇడ్లీలను అమ్ముతున్నాడు. అయితే ఈ ఇడ్లీలను రుచి చూసిన యువకుడిపై ప్రశంసలు కురపిస్తున్నారు. సుధీర్ ఇడ్లీలను అందరూ చేసే విధంగా కాకుండా రాగి మరియు ఇతర సిరిధాన్యాలతో తయారు చేస్తున్నాడు. దాంతో రుచి మరి ఆరోగ్యాన్ని అందించే ఇడ్లీల పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక తాజాగా ఈ ఇడ్లీలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.

venkaiah naidu on vishak idly
venkaiah naidu on vishak idly

“ఈరోజు ఉదయం అల్పాహారంగా ‘వాసెన పోలీ’ల వారి రాగి, జొన్న, సిరిధాన్యాల ఇడ్లీలను తీసుకున్నాను. ఎంతో రుచిగా అనిపించాయి. ఆరోగ్యకరమైన ఇలాంటి ఆహారానికి ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం అందించాలి. ముఖ్యంగా యువత ఇలాంటి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. సంప్రదాయ పద్ధతిలో రాగులు, జొన్నలు, సిరి ధాన్యాలతో అల్పాహారాన్ని తయారు చేసి ‘వాసెన పోలీ’ పేరుతో విశాఖపట్నంలో అల్పాహార కేంద్రాన్ని నిర్వహిస్తున్న యువకుడు చిట్టెం సుధీర్ కు అభినందనలు. వినూత్న ఆలోచనలతో మన సంప్రదాయ ఆహారపద్ధతులను కాపాడుకునేందుకు యువత చొరవ తీసుకోవాలి.” అంటూ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.