రివైండ్ 2024: హైప్ తో వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచిన సినిమాలు

-

2024 సంవత్సరంలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే కొన్ని మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. 2024 సంవత్సరం పూర్తి కాబోతున్న సందర్భంగా ప్రేక్షకులను నిరాశపరిచిన చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.

గుంటూరు కారం:

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించలేదని చెప్పవచ్చు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం వాటిని అందుకోవడంలో తడబడింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఫ్యాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాకి రెడీ అవుతున్నాడు మహేష్ బాబు.

సైంధవ్:

వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రంగా రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. హిట్ 1, హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయింది.

ద ఫ్యామిలీ స్టార్:

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం… గీత గోవిందం తరహాలో మెస్మరైజ్ చేస్తుందని రిలీజ్‍కి ముందు భావించారు. విడుదలైన తర్వాత ఫలితం విజయ్ అభిమానులను నిరాశపరిచింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‍గా కనిపించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

డబుల్ ఇస్మార్ట్:

లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇస్మార్ట్ శంకర్‍కి సీక్వెల్ గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. సంజయ్ దత్ విలన్ గా కనిపించిన ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్‍గా నటించారు.

మిస్టర్ బచ్చన్:

దర్శకుడు హరీష్ శంకర్ నుండి చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ చిత్రం.. నెగిటివిటీతో కొట్టుమిట్టాడి చివరకు ఫ్లాప్ గా నిలిచింది. ఈ ఏడాది రవితేజకు ఈగల్ తర్వాత మరో ఫ్లాప్‍ను మిగిల్చింది.

Read more RELATED
Recommended to you

Latest news