రెండు తెలుగు రాష్ట్రాలను జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక కేసు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ రేప్ కేసుపై టాలీవుడ్ సంచలన దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దిశా కేసు తరహాలోనే.. నిందితుల మోహాలను మీడియా ముందు చూపించాలని రామ్ గోపాల్ వర్మ డిమాండ్ చేశారు.
పేద వారైన దిశా నిందితుల మోఖాలను మీడియాకు చూపించినప్పుడు.. ఈ కేసులోని నిందితులను ఎందుకు చూపించరని ప్రశ్నించారు. ఈ కేసులో.. దుబ్బాక ఎమ్మె ల్యే రఘు నందన్ రావు.. గొంతు ఎత్తక పోతే.. ఈ కేసు ఎప్పుడో మరుగున పడేదని దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించడం వల్లే.. ఈ కేసులో పురోగతి లభించిందని పేర్కొన్నారు వర్మ. అయితే.. ఈ కేసుపై ప్రశ్నించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ పై కేసులు పెడుతున్నారని తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్ గోపాల్ వర్మ.
All those demanding to book a case of section 228a on him are completely silent after 1 question of @RaghunandanraoM ,why a case was not booked on anyone when Disha case accused minors were shown repeatedly on media and multiple interviews were taken of her family members?
— Ram Gopal Varma (@RGVzoomin) June 10, 2022