టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు ట్విట్టర్ లో ఏదో ఓ ట్వీట్ చేస్తూ… అందరికీ షాక్ ఇస్తుంటారు. అయితే… తాజాగా ఆ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… టాలీవుడ్ సినిమాలపై ట్వీట్ చేశారు. రెండు రోజుల కిందట.. హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ టాలీవుడ్ సినిమాలపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగిందన్నారు. అయితే.. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా వర్మ తన స్టైల్ లో రెస్పాండ్ అయ్యారు. ప్రధాని మోడీ 150 సినిమాలను ఉద్దేశించి.. ఏం మాట్లాడలేదు.. కేవలం బాహుబలి, పుష్ప సినిమాల గురించి మాత్రమే మాట్లాడాడు అంటూ టాలీవుడ్ కు చురకలు అంటించారు. ”ప్రధాని కేవలం బాహుబలి, పుష్ప సినిమాల గురించి మాత్రమే మాట్లాడాడు. మిగతా 150 సినిమాల గురించి ఏం మాట్లాడలేదు. మీరు బ్రేక్ డాన్సులు ఆపండి. బాహుబలి, పుష్ప లాంటి సినిమా శాండల్ వుడ్ లో వచ్చినా.. వారిని మోడీ ప్రశంసిస్తారు. ” అంటూ తన స్టైల్ లో ట్వీట్ చేశారు వర్మ.
Tollywood doesn’t need to do breakdance 💃with champagne🍾 because PM praised ..He was talking only about Bahubali,Pushpa and not the other 150 films we make every year ..if @ssrajamouli and @alluarjun were Kannadigas he would have hailed SANDALWOOD
— Ram Gopal Varma (@RGVzoomin) February 6, 2022