ఈనెల 10వ తేదిన మంత్రి హరీష్ రావు వరంగల్, హన్మకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో డయాగ్నస్టిక్ హబ్నకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే రక్తనిధి కేంద్రం, తల్లిపాల బ్యాంక్, టీబీ ప్రత్యేక క్లినిక్లను మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.