చనిపోయిన వారికి “RIP” అని చెప్పొద్దు : RGV ట్వీట్

-

సంచనాలు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ టాలీవుడ్‌ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ. ఎప్పుడు ఏదో ఒక అంశంపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ.. రచ్చ చేస్తూ ఉంటారు వర్మ. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీతారలనే టార్గెట్‌ చేస్తూ… కౌంటర్లు పేల్చుతుంటారు. అయితే.. తాజాగా చనిపోయిన వారి గురించి వివాదస్పద ట్వీట్‌ చేశారు వర్మ. చనిపోయిన వ్యక్తికి RIP చెప్పొద్దంటూ కామెంట్స్‌ చేశారు వర్మ.

“చనిపోయిన వ్యక్తికి RIP చెప్పడం అతన్ని అవమానించడమే. ఎందుకంటే ఇక్కడ శాంతియుతంగా విశ్రాంతి తీసుకునే వ్యక్తులను సోమరిపోతులు అంటారు…కాబట్టి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు , “RIP” వంటి మాటలు చెప్పే బదులు “మంచి జీవితాన్ని గడపండి, మనం మరింత ఆనందించండి” అని చెప్పాలి.” అంటూ రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు.

ఇక మరో ట్వీట్‌ లో “ఒక మంచి వ్యక్తి చనిపోయాడని.. చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ.. ఆ చనిపోయిన వ్యక్తి… సంతోషకరమైన ప్రదేశానికి వెళుతున్నాడు. కాబట్టి.. ఒక వ్యక్తి చనిపోతే.. బాధపడటం కంటే.. సంతోష పడటం మంచిది” అంటూ వర్మ పేర్కొన్నారు. ఇక రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్లు చూసిన నెటిజన్లు.. తమకు నచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడు ఏదో పిచ్చి.. పిచ్చి ట్వీట్లు చేస్తూ.. ఉంటాడు… వర్మకు ఎక్కడా పనిలేదంటూ కొంతమంది కామెంట్లు పెడుతూంటే.. మరికొంత మంది వర్మను మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news