వేసవిలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. వేసవికాలంలో చాలామంది తామరతో బాధపడుతూ ఉంటారు తామర రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వేసవి కాలంలో చాలా రకాల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక జాగ్రత్త. ఈ తామర అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. పాదాలు గోళ్లు లేదా తల మీద కూడా రావచ్చు. అయితే ఏడాదికి ఇది ఒకసారి మాత్రమే వస్తుంది సమ్మర్ లో ఎక్కువగా వస్తుంది ఎందుకంటే చెమట హ్యుమిడిటీ కారణంగానే. వేసవికాలంలో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ని పాటించండి.
మీ చర్మాన్ని ఎప్పుడూ కూడా పొడిగా ఉంచుకోవాలి. అలానే శుభ్రంగా ఉంచుకోవాలి రెండు పూట్ల స్నానం చేయడం చెమట లేకుండా చూసుకోవడం ముఖాన్ని కడుక్కోవడం ఇలా శుభ్రతని పాటిస్తే ఖచ్చితంగా ఈ సమస్య రాకుండా ఉంటుంది. గాలి తగిలే బట్టల్ని వేసుకుంటే కూడా ఈ సమస్య నుండి దూరంగా ఉండొచ్చు. టైట్ బట్టలు వేసుకుంటే ఫంగస్ వ్యాప్తి చెందవచ్చు. కాబట్టి కాస్త గాలి తగిలే బట్టల్ని వేసుకోండి కాటన్ బట్టలు వేసుకోవడం మంచిది. ఒకరి నుండి ఒకరికి ఇది సోకే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ కనుక ఎవరికైనా తామర ఉంటే వాళ్ళ వస్తువుల్ని ఉపయోగించకండి.
తుడుచుకున్న టవల్ దువ్వుకున్న దువ్వెన బట్టలు ఇలాంటివి షేర్ చేసుకోకండి. హైజీన్ గా ఉండడం ముఖ్యం. ముఖ్యంగా జంతువులని పట్టుకున్న తర్వాత చేతులు కడుక్కోవడం వంటివి చేస్తూ ఉండండి ఒకవేళ కనుక ఈ సమస్యతో పెంపుడు జంతువులు బాధపడుతున్నట్లయితే తగ్గించడం మంచిది. పశువుల డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఆ సమస్య నుండి బయటకు తీసుకురండి యాంటీ ఫంగల్ క్రీమ్స్ ని ఉపయోగించడం వలన కూడా సమస్యలను దూరంగా ఉండొచ్చు ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలని వేసవి కాలంలో పాటిస్తే తామర రాకుండా ఉండొచ్చు. లేకపోతే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.