ShyamSinghaRoy : శ్యామ్‌ సింగరాయ్‌ టైటిల్‌ రిలీజ్‌

-

నేచురల్‌ స్టార్‌ నాని.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇటీవల టక్‌ జగదీష్‌ సినిమాతో సందడి చేసిన… నాని… ప్రస్తుతం శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్‌ పూర్తి చేసేకుందని టాక్‌. అయితే ఈ సినిమా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, మృతి శక్తి మరియు మడోన్నా సెబాస్టియన్ లు ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ ను వదిలింది. చిత్ర బృందం. Rise of Shyam పేరుతో ఈ సాంగ్‌ ను విడుదల చేసింది శ్యామ్‌ సింగ్‌ రాయ్‌ టీం. ఇక సాంగ్‌ లో నాచురల్‌ స్టార్‌ నాని చాలా పవర్‌ ఫుల్‌ గా కనిపించారు. ఈ పాట లిరిక్స్ వింటుంటే.. ఈ సినిమా పూర్తి గా ఓ అన్యాయంపై పోరాటం లాగా అనిపిస్తోంది. ఇక ఈ పాటతో ఈ సినిమాపై అంచనాలు భారీ పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news