ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డు లపై కేంద్ర ప్రభుత్వం పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కి అనుకూలంగా ఉన్న వారికే పద్మ అవార్డు లను ప్రకటించారని పలువురు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. దీని పై కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రం పై విమర్శలు గుప్పించింది.
కరోనా మహమ్మరి సమయంలో దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలకు సహయం చేసిన సోన్ సూద్ కు పద్మ అవార్డు ఇవ్వక పోవడం పట్ల పలువరు రాజకీయ నాయకలు, పలువురు సెలబ్రెటీలు, సామాన్యు లు కూడా కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ కు పద్మ శ్రీ అవార్డు ఇవ్వడం పట్ల కూడా పలువురు మండి పడుతున్నారు. కంగనా సినిమా లలో నటించడం తప్ప ప్రజలకు ఎలాంటి సహాయం చేసిందని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు సహాయం చేయలేదు గానీ.. బీజేపీ కి చాలానే సహయం చేసింది.
అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కంగన రౌనత్ కు పద్మ శ్రీ అవార్డు తో సత్కరించిందని విమర్శిస్తున్నారు. ఈ విమర్శల స్థాయి రోజు రోజు కు పెరిగిపోతుంది. సోషల్ మీడియా లో సోను సూద్ చేసిన సేవలను కంగనా రౌనత్ చేస్తున్న ఎక్స్ పోజింగ్ లను ఫోటో ల రూపం లో పెట్టి కేంద్రాన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే గతం లో కూడా తెలంగాణ ముఖ్య మంత్రి పద్మ అవార్డు ల గురించి కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.