రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 426 మంది బలి

-

దేశంలో ప్రతి రోజు రహదారులు నెత్తిరోడుతున్నాయి. గతంలో లేనంతగా గతేడాది రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరిగాయని నేషన్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల్లో 2021లో ఏకంగా 1.55లక్షల మంది మృతిచెందినట్లు ఈ నివేదిక తెలిపింది. సగటున ప్రతి గంటకు 18 మంది మరణిస్తుండగా, ఒక్కరోజులో 426 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.

గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన 4.03 లక్షల ప్రమాదాల్లో 3.71 లక్షల మంది గాయపడినట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్​సీఆర్​బీ) నివేదిక పేర్కొంది. ‘భారతదేశంలో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు-2021’ కింద ఎన్‌సీఆర్‌బీ ఈ నివేదికను విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య గతేడాది గరిష్ట స్థాయికి చేరుకోగా.. గాయపడిన వారి సంఖ్య మాత్రం గత సంవత్సరాలతో పోలిస్తే తగ్గిందని నివేదిక తెలిపింది. మిజోరం, పంజాబ్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల కంటే.. మరణించినవారి సంఖ్యే అధికంగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ఈ మృతులంతా ద్విచక్రవాహనదారులేనని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news