MS Dhoni : ధోనీ గురించి ఆ సీక్రెట్ చెప్పేసిన ఊతప్ప

-

మహేంద్ర సింగ్‌ ధోనీ గురించి చిన్న న్యూస్ వచ్చినా సరే ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా చూస్తుంటారు. అయితే తాజాగా ధోనీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఈ మిస్టర్ కూల్ ఫిట్‌నెస్‌ కోసం ఎంత కష్టపడతాడో తెలిసిందే. 41 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు.

తాజాగా టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప.. ధోనీ ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. బటర్‌ చికెన్‌ను ఆర్డర్‌ చేసి.. ధోనీ దాన్ని ఎలా తినేవాడో వివరించాడు.

‘రైనా, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆర్పీ సింగ్‌, పియూష్‌ చావ్లా, మునాఫ్‌ పటేల్‌, ధోనీ, నేను.. మేమంతా ఓ గ్రూప్‌. అప్పుడప్పుడూ అందరం కలిసి హోటల్‌కు వెళ్లి తినేవాళ్లం. దాల్‌ మఖనీ, బటర్‌ చికెన్‌, జీరా ఆలూ, గోబీ, రోటీలు ఆర్డర్‌ చేసే వాళ్లం. అయితే.. ధోనీ మాత్రం తినే విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు. బటర్‌ చికెన్‌ ఆర్డర్‌ చేసి.. చికెన్‌ తినకుండా కేవలం గ్రేవీ మాత్రమే తినేవాడు. ఒక వేళ చికెన్‌ తినాలనుకుంటే.. రోటీలను పక్కనపెట్టేవాడు. తినే విషయంలో తాను కాస్త విచిత్రంగా ఉండేవాడు’’ అని ఉతప్ప ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Latest news