కొత్తషోలో అదరగొట్టబోతున్న రాకింగ్ రాకేష్ – జోర్దార్‌ సుజాత ల జంట..!!

-

జీవితంలో పైకి రావడం అనేది చాలా కష్టమైన విషయం. కష్టపడి ఉన్నత స్థానంలో నిలబడిన వారిని చూసి వేరే వాళ్ళు చాలా ఈజీగా పైకి వచ్చారు అనుకుంటారు.కాని వారు ఈ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడి వుంటారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి వుంటారో మనకు తెలియదు. అలాంటి కష్టాలు పడి విజేత గా నిలిచిన వ్యక్తి ,మనం ముద్దుగా పిలుచుకొనే రాకింగ్ రాకేశ్ గురించి తెలుసుకుందాం. రాకేశ్ చిన్నప్పటి నుండి ఆర్టిస్ట్ కావాలని కలలు కన్నాడు. తన మనసులో మాట గ్రహించి దేవుడు జబర్దస్త్ ప్రోగ్రాం రూపం లో అవకాశం కల్పించాడు. ముందు టీమ్ లో సభ్యుడిగా చేరి అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి టీమ్ లీడర్ గా అయ్యాడు.తాను చేసిన స్కిట్స్  జనాలను కుడుపుబ్బ  నవ్వించి మంచి రేటింగ్ తెచ్చిపెట్టాయి. 

రెమ్యూనేషన్ గురించి పట్టించుకోకుండా జనాలను నవ్వించడమే ధ్యేయంగా మొదటి నుండి ఇప్పటి వరకు అదే కమిట్ మెంట్ తో రాకేశ్  నటిస్తూ వున్నాడు. అలాగే  జోర్దార్‌ సుజాతగా పేరు తెచ్చుకున్న సుజాత కూడా చిన్న పల్లె టూరు నుండి వచ్చి , చాలా కష్టాలు పడి, తన టాలెంట్ తో  ఒక టీవీ ఛానెల్ జాబ్ సంపాదించి అక్కడ పనిచేస్తూ,  జోర్దార్‌ వార్తల ప్రోగ్రామ్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

అదే క్రేజ్ తో బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొనడం జరిగింది. తర్వాత జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ తో కలసి సుజాత చేసిన స్కిట్స్స్ ప్రజలను విపరీతంగా అలరించాయి. అలా స్కిట్‌లు చేస్తూ వున్న  సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి, పెద్దలకు చెప్పడంతో,వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు అంగీకరించారు. ప్రేమ తర్వాత వీరి ఇద్దరి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి.త్వరలోనే వీరి పెళ్ళి జరుగబోతుంది.

అయితే ఇంత కష్టపడి పైకి వచ్చిన వీరికి ఈటివి వారు మిస్టర్ అండ్ మిసెస్ రియాల్టీ షో లో ఒక జంటగా పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. వీరితో పాటు మరో తొమ్మిది జంటలు ఇందులొ పాల్గొనబోతున్నాయి. ఈ షో మంగళవారం రాత్రి 9.30 ప్రారంభం కానుంది. రాకేష్ మరియు సుజాతల మధ్య ప్రేమ, అనుభందం ఎన్నో సార్లు నిరూపితం అయ్యింది.

ఆ ప్రేమ, అనుభందం మరియు అవగాహనతో వారు షోలో గెలిచే ఛాన్స్ లు ఎక్కువుగా వున్నాయి. అదే నమ్మకం ఇద్దరి ముఖాల్లో కనిపిస్తూ ఉంది.ఇద్దరూ ఎప్పుడెప్పుడు షోలో పాల్గొందామా అని ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు.ఇద్దరికీ షో లో గెలవాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం.

Read more RELATED
Recommended to you

Latest news