BIG BREAKING : కేంద్రం కీలక నిర్ణయం.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌..

-

రైల్వే ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ను ప్రకటించింది. కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు బోనస్ ప్రకటన సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. గతేడాది నుంచి రైల్వే శాఖ భారీ లాభాలను గడించింది. ఈ క్రమంలోనే లాభాల్లో నుండి కొంత ఉద్యోగులకు కానుకగా ప్రకటించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైల్వే ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Bonus likely for Indian Railway employees of 78-day wages - News Nation  English

ఈ పీఎల్‌బీ బోనస్ రైల్వే విభాగంలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు వర్తిస్తుంది. రైల్వే విభాగంలోని సాయుధ దళాలైన RPF/RPSF సిబ్బందికి ఈ బోనస్ వర్తించదు. ప్రస్తుతం రైల్వే శాఖలో 11.27 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులున్నారు. తాజా నిర్ణయం ద్వారా ఈ 11 లక్షల పై చిలుకు ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news