రాష్ట్ర రాజకీయం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం ప్రచారం మునుగోడు నియోజకవర్గంలో వాడివేడిగా జరుగుతోంది. పార్టీల నాయకులు ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రధాని మోడీ 18వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే మునుగోడు నుంచి పోటీ నుండి తప్పుకుంటామని.. బీజేపీ సిద్ధమా..? అంటూ ట్వీట్టర్ ద్వారా సవాల్ విసిరారు. ఫ్లోరోసిస్ నిర్మూలనకు 19వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేస్తే పట్టించుకోని కేంద్రం..రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తికి 18వేల కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపించారు మంత్రి కేటీఆర్.
‘ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడైతే దేశ సంపద పెరగదు..మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే నల్గొండ జిల్లా బాగుపడదు.. రాజకీయ ప్రయోజనం కాదు, నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారు.. గుజరాత్ కు గత ఐదు నెలల్లో 80వేల కోట్ల ప్యాకేజీలు.. మా తెలంగాణకు కనీసం 18వేల కోట్లు ఇవ్వలేరా..? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.