మైదానంలో క్రికెట‌ర్ మిచెల్ స్టార్క్ భార్య‌తో రోమాంటిక్ సీన్.. వీడియో వైర‌ల్

-

ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ గురించి తెలియని వారు ఉండ‌రు. బంతితో మైదానంలో ఎన్నో అద్భుతాలు సృష్టించే స‌త్త ఉన్న బౌల‌ర్ మిచెల్ స్టార్క్. అయితే మిచెల్ స్టార్క్ తో ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెట‌ర్ అలీసా హేలీల వివాహం జ‌రిగిన విషయం అందిరికీ తెలిసిందే. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట ఐదు సంవ‌త్స‌రాల క్రితం ఒక్క‌టైయ్యారు. కాగ ఆస్ట్రేలియా మెన్స్ క్రికెట్ జట్టుకు ప్ర‌స్తుతం ఎలాంటి సిరీస్ లు లేక పోవ‌డంతో మిచెల్ స్టార్క్ చిల్ అవుతున్నాడు.

అయితే ఆస్ట్రేలియా ఉమెన్స్ జ‌ట్టు ఇంగ్లాండ్ తో యాషెస్ సిరీస్ జ‌రుగుతుంది. అయితే మిచెల్ స్టార్క్ ఈ సిరీస్ ను చూడ‌టానికి మైదానానికి వ‌చ్చాడు. అయితే మ్యాచ్ మ‌ధ్య‌లో వ‌ర్షం రావ‌డంతో ఈ మ్యాచ్ కొంత సమ‌యం పాటు నిలిచిపోయింది. దీంతో ఈ ల‌వ్ బ‌ర్డ్స్ స‌మ‌యం దొర‌క‌డంతో రోమాన్స్ లో మునిగిపోయారు. ఇద్ద‌రు మాట్లాడుకుంటూ.. న‌వ్వుకుంటూ ఉన్నారు. అయితే ఇది మొత్తం కెమెరా కంటికి చిక్కింది. దీంతో ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news