ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 37 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ను ఓడించిన గుజరాత్.. 5వ స్థానం నుంచి అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. గుజరాత్ టైటాన్స్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో రాజస్థాన్ విఫలం అయింది. గుజరాత్ బౌలర్ల దాటికి రాజస్థాన్ కుప్పకూలింది. యష్ దయాళ్, లూకీ ఫెర్గూసన్ తలో 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు.
అలాగే మహ్మద్ షమీ, హార్ధిక పాండ్యా ఒక్కో వికెట్ తీశారు. గుజరాత్ బౌలర్ల ముందు బట్లర్ (54) మినహా ఎవరూ నిలవలేక పోయారు. హెట్ మెయర్ (29) ప్రయత్నించినా.. విఫలం అయ్యాడు. దీంతో రాజస్థాన్ నిర్ణత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 155 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 37 పరుగుల తేడాతో ఓడింది. కాగ ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ హార్ధిక్ పాండ్యా (87 నాటౌట్), అభినవ్ మనోహర్ (43), మిల్లర్ (31 నాటౌట్) రాణించారు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో రాణించిన హార్ధిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.