తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మకమైన మెడికల్ యూనిట్ అందుబాటులోకి రానుంది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో గల మెడికల్ డివైజెస్ పార్కులో నూతనంగా నిర్మించిన స్టెంట్ల తయారీ, పరిశోధనా యూనిట్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ స్టెంట్ల తయారీ, పరిశోధనా యూనిట్ ను సుల్తాన్ పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ లో నిర్మించారు. ఈ యూనిట్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ యూనిట్ నేడు ప్రారంభం కానుంది.
ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో లైఫ్ సైన్సెస్ రంగంలో ఈ రోజు మరో ముందడుగు పడనుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కోన్నారు. ఆసియా ఖండం లోనే అతి పెద్ద స్టెంట్ల తయరీ, పరిశోధనా యూనిట్ నేడు ప్రారంభింస్తున్నట్టు తెలిపారు. ఈ స్టెంట్ల తయరీ, పరిశోధనా యూనిట్ తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని ట్విట్టర్ తెలిపారు.
Yet another milestone for Hyderabad Medical Devices Park & Life Sciences ecosystem in Telangana
Delighted and looking forward to inaugurating Asia's largest stent manufacturing and R&D facility of Sahajanand Medical Technologies @SMTStents tomorrow at Sultanpur in Sangareddy pic.twitter.com/HtRBLSYkVR
— KTR (@KTRTRS) April 14, 2022