వారికి గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై రూ.3,000 తగ్గింపు..!

-

రోజు రోజుకీ గ్యాస్ సిలెండర్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఒక గ్యాస్ సిలెండర్ కొనాలంటే రూ.1000 జేబులో పెట్టుకోవాల్సిందే. లేకపోతే సిలెండర్ రాదు. అయితే భారీగా గ్యాస్ సిలెండర్లు పెరగడం తో సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు పొందే అవకాశం కూడా వుంది. ఇక దాని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

 

gas cylinder

దిగ్గజ ఇవాలెట్ సంస్థ పేటీఎం ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. కేవలం కొందరికి మాత్రమే. పేటీఎం ద్వారా సిలిండర్ బుక్ చేస్తే రూ.3 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం తొలిసారి పేటీఎం ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఉంటుంది. ఇలా బుక్ చేసి కాస్త డబ్బుల్ని ఆదా చేసుకోచ్చు.

ఒకేసారి రూ.3 వేలు క్యాష్‌బ్యాక్ రాదు. మూడు సిలిండర్లపై మూడు విడతల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. తొలిసారి సిలిండర్ బుక్ చేసుకుంటే రూ.10 నుంచి రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ రావొచ్చు. తర్వాత రెండో సిలిండర్, మూడో సిలిండర్ బుకింగ్‌పై కూడా ఇలాంటి క్యాష్‌బ్యాక్ వస్తుంది. రూ.5 నుంచి రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ రావచ్చు. ఇలా గరిష్టంగా మూడు వేలు వచ్చే ఛాన్స్ వుంది.

పేటీఎం వాలెట్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా సిలిండర్ బుకింగ్ సమయంలో డబ్బులు చెల్లిస్తేనే ఈ ఆఫర్ ని పొందొచ్చు. కనీసం రూ.500కు పైగా లావాదేవీ నిర్వహించాలి. 2021 డిసెంబర్ నాటికి తొలిసారి సిలిండర్ బుక్ చేసుకొని ఉండాలి. తర్వాతి రెండు నెలల్లో తర్వాలి సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ తర్వాత స్క్రాచ్ కార్డు వస్తుంది. దానిని చూసి వినియోగించుకోకపోతే డబ్బులు రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version