Karvy Scam: కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ రూ.3520 కోట్ల మోసం

-

హైదరాబాద్ : కార్వి స్టాక్ బ్రోకింగ్ సంస్థ మోసం రూ. 3520 కోట్లకు చేరింది. ఇవాళ ఈ సంస్థ మోసలపై నాంపల్లి కోర్టు లో చార్జిషీట్ దాఖలు చేసారు సిసిఎస్ పోలీసులు. 5 వేల పేజీల ఛార్జ్ షీట్ లో కార్వీ సంస్థ మోసాలను ఈ సందర్భంగా పొందపరిచారు పోలీసులు. 8 ఏళ్ల నుండి బ్యాంక్ లు నుండి రుణాలు పొందిన కార్వి సంస్థ.. కస్టమర్ల షేర్లను తమ షేర్లు గా చూపించి బ్యాంక్ ల నుండి రుణాలు తీసుకుంది.

కస్టమర్ల షేర్ల లోని 720 కోట్లు కార్వి ఇతర సంస్థలకు మళ్లించింది. రెండేళ్ల క్రితం సెబీ కు ఫిర్యాదులు కూడా అందాయి. బ్యాంక్ ల నుండి తీసుకున్న 2800 కోట్లు రుణాన్ని షెల్ కంపెనీలకు మళ్లించారు కార్వి పార్థసారథి. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పలువురు బ్యాంక్ ప్రతినిధులు. ఇప్పటి వరకు 8 మందినీ అరెస్ట్ చేసారు పోలీసులు. ఇతర రాస్ట్రాల్లోను కార్వి పై కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం బెంగుళూరు జైల్ లో పార్థ సారథి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news