కెసిఆర్ ఫామ్ హౌస్ లో మృత దేహం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ లో ఓ యువకుడు మృతి చెందాడు. వ్యవసాయ బావి దగ్గర పని చేస్తుండగా… అదుపుతప్పి ఆ యువకుడు బావిలో పడ్డాడు. దీంతో అక్కడికక్కడే ఆ యువకుడు మృతి చెందాడు. అయితే ప్రస్తుతం ఈ యువకుడి మృతి తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. నరబలి ఇచ్చారంటూ విపక్షాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నాయి.

ఇలాంటి తరుణంలో బి ఎస్ పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘటన పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఫాం హౌస్ లో యువకుడి అనుమానాస్పద మృతిపై తక్షణమే CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఒక ప్రకటన చేయాలని పేర్కొన్నారు. పోలీసులు కేవలం 174 Cr PC కేసు నమోదు చేస్తేనే సరిపోదు, ఫాంహౌస్ ఓనరు పై మొదట 304(A) IPC కింద కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.