ట్విటర్ యూజర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఖాతా భద్రతకు కూడా రుసుం

-

తన ఖాతాదారులకు ట్విటర్ మరో షాక్ ఇచ్చింది. తన నష్టాలను పూడ్చుకునేందుకు రోజుకో పాలసీతో యూజర్స్ ఖజానా ఖాళీ చేస్తోంది. మరో కొత్త పాలసీతో డబ్బులు దండుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పటి నుంచి ట్విటర్ ఖాతా భద్రంగా ఉండాలంటే వినియోగదారులు కొంత రుసుం చెల్లించాలని కొత్త ప్రకటన చేసింది.

వినియోగదారులు తమ ఖాతాలను భద్రపరుచుకునేందుకు రెండు కారకాల ఆథెంటికేషన్‌ పద్ధతిగా టెక్స్ట్‌ సందేశాలను పంపేందుకు ఉపయోగించడానికి ఇప్పుడు పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లను మాత్రమే అనుమతిస్తామని వెల్లడించింది. ఈ పద్ధతి కింద బ్లూ టిక్‌ సబ్‌స్క్రైబర్లు మాత్రమే మార్చి 20 నుంచి టెక్స్ట్‌ మెసేజ్‌లను వారి 2ఎఫ్‌ఏ పద్ధతిగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇతర ఖాతాల వారు 2ఎఫ్‌ఏ ప్రమాణీకరణ యాప్‌ లేదా సెక్యూరిటీ కీని ఉపయోగించవచ్చునని పేర్కొంది.

ఇంతకుముందు, ఫోన్ నంబర్ ఆధారిత 2ఎఫ్‌ఏను హ్యాకర్లు దుర్వినియోగం చేస్తున్నారని నమ్ముతున్నట్లు కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఒక సబ్‌స్క్రైబర్‌ చేసిన ట్వీట్‌కు సమాధానంగా కంపెనీ తన విధానాన్ని మార్చుకున్నట్లు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ఇటీవల చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news