రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలి: జీ-7 దేశాధినేతలు

-

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని జీ-7 సభ్యదేశాలు నిర్ణయం తీసుకున్నాయి. రష్యా దాడులు కొనసాగినంత వరకు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని దేశాధినేతలు తీర్మానించారు. జర్మనీలో జరుగుతున్న జీ-7 సభ్యదేశాల సదస్సు మంగళవారం ముగిసింది. ఈ మేరకు రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాలని తెలిపారు. పెట్రోల్, గ్యాస్, బంగారం, ఇతర ఇంధనాల విక్రయాలతో అందుతున్న నిధులతోనే రష్యా యుద్ధానికి దిగిందన్నారు.

జీ-7 దేశాలు
జీ-7 దేశాలు

అందుకే రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఇంధనాలు, వాటి ధరలపై పరిమితులు విధించాలని జీ-7 దేశాధినేతలు నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఆంక్షలు కొనసాగింపు విషయంలో కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించారు. రష్యా నుంచి ఇంధన దిగుమతులను కనీస స్థాయికి తేవడం ద్వారా ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావచ్చని జీ-7 నేతలు భావిస్తున్నారు. ఇంధన సరఫరా నౌకలు, బీమా కంపెనీలు అత్యధికంగా యూరప్ దేశాలవే కావడంతో అన్ని అంశాలు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ నుంచి గోధుమల రవాణాను రష్యా నిలువరించడంతో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు సాయం చేయాలని సభ్యులు నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news