చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్…. నాటో వేదికగా హెచ్చరికలు చేసిన జో బైడెన్

-

అమెరికా , చైనాకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నాటో వేదికగా జరిగిన సమావేశంలో జో బైడెన్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాకు సైనిక పరంగా చైనా సహయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. గురువారం బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ.. చైనా ఆర్థిక ప్రయోజనాలు రష్యాతో కాకుండా పశ్చిమ దేశాలతో ఉన్నాయని జీ జిన్ పింగ్ గ్రహించారంటూ వ్యాఖ్యలు చేశారు. 

గత వారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఫోన్ లో మాట్లాడుకున్న సందర్భంలో కూడా రష్యాకు చైనా సాయంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాకు సహాయం చేయకూడదని అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. రష్యా, చైనా సాయాన్ని అడిగిందని వస్తున్న వార్తల నేపథ్యంలో మరోసారి అమెరికా, చైనాను హెచ్చరించింది. ఒక వేళ రష్యాకు సహాయం చేస్తే…. తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుందని అమెరికా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news