రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జోక్యం చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటాం…. పుతిన్ వార్నింగ్

-

అనుకున్నదే అయింది. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించింది. తాజాగా యుద్ధాన్ని ప్రకటిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లక్షకు పైగా రష్యా సైన్యం ఉక్రెయిన్ బార్డర్ కు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. ఇప్పటికే ఈ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మరోసారి అత్యవసర సమావేశం నిర్వహించింది. 

ఇదిలా ఉంటే తాజాగా రష్యా మిలిటిలీ ఆపరేషన్ లో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే… ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షడు పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. యుద్ధానికి సిద్ధం అయిన వేళ ఉక్రెయిన్ కూడా తమ బలగాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఉక్రెయిన్ కు మూడు వైపుల రష్యా సైన్యం మోహరించింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పుతిన్ ప్రతినబూనారు. ఇప్పటికే ఎయిర్ స్పెస్ మూసేసింది ఉక్రెయిన్. ఇదిలా ఉంటే నాటో కూటమిలో సభ్యత్వం ఉన్న ఉక్రెయిన్ కు అండగా… నాటో కూటమి సైన్యం యుద్ధంలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. నాటో దళాలు పరోక్షంగా సహాయం చేసినప్పటికీ… నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news