russia- ukraine war: అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను తిరస్కరించిన రష్యా…

-

ఉక్రెయిన్ – రష్యా యుద్ధానికి ఎప్పుడు ముగింపు పలుకుతారో తెలియకుండా ఉంది. కేవలం మూడు, నాలుగు రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అనుకున్నప్పటికీ… యుద్దం మొదలై మూడు వారాలు గడిచిపోయింది. ఉక్రెయిన్ సేనలు, రష్యన్ ఆర్మీకి ఎదురొడ్డి నిలుస్తున్నాయి. ఫలితంగా అందమైన రాజధాని కీవ్ తో పాటు ఖార్కీవ్, మరియోపోల్ వంటి నగరాలు మసిదిబ్బలుగా మారుతున్నాయి. ఇక ఎన్ని ఆంక్షలు విధించిన రష్యా మాట వినే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికు అమెరికా, యూరోపియన్ దేశాలు, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నాయి. అయినా… తగ్గదేది లేదంటున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ నాటోలో చేరకూడదనే బలమైన హామీ ఇచ్చినప్పుడే యుద్ధం ముగిసేలా కనిపిస్తోంది. మరోవైపు నాటో , అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు అందిస్తున్న సైనిక, ఆయుధ సాయంతో రష్యా బలగాలకు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. 

ఇదిలా ఉంటే నిన్న అంతర్జాతీయ కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను కూడా రష్యా పట్టించుకోవడం లేదు. ఐసీజే ఆదేశాలను తిరస్కరిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అంతర్జాతీయ న్యాయస్థానం ఉక్రెయిన్ పై మిలటరీ దాడిని ఆపేయాలంటూ నిన్న ఆదేశాలు జారీ చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ బలగాాలను వెనక్కి రప్పించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అంతర్జాతీయ కోర్ట్ తీర్పుపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షడు జెలన్ స్కీ.. కోర్ట్ లో మేమే గెలిచామని, ఇంటర్నేషనల్ లా ప్రకారం కోర్టు ఆదేశాలను రష్యా తప్పక పాటించాలని అన్నారు. తాజాగా ఈ ఆదేశాలను రష్యా తిరస్కరించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news