ఉక్రెయిన్ లో భారత విద్యార్థి నవీన్ మృతి చెందారు. రష్యా జరిపిన దాడిలో నవీన్ మరణిాంచారు. ఈ విషయాన్ని భారతీయ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. రష్యన్ ఆర్మీ ఖర్కీవ్ నగరంపై రష్యా జరిపిన దాడి సమయంలో నవీన్ మరణించారు. నవీన్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. భోజనం కోసం బయటకు వచ్చిన సందర్భంగా దాడి చోటు చేసుకోవడంతో వైద్య విద్యార్థి నవీన్ అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. నవీన్ మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. విదేశాంగ శాఖ నవీన్ కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి… రష్యా మరియు ఉక్రెయిన్ రాయబారులను పిలిపించి, ఖార్కివ్‌లో మరియు ఇతర సంఘర్షణ ప్రాంతాలలో ఉన్న నగరాల్లో ఇప్పటికీ ఉన్న భారతీయ పౌరులకు అత్యవసరంగా సురక్షితమైన మార్గం కోసం డిమాండ్ చేశారు.
ఈరోజు ఉదయమే భారత విదేశాంగశాఖ, ఎంబసీ వెంటనే భారతీయ విద్యార్థులు కీవ్ ను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా సూచనలు చేసింది. రష్యా కీవ్ నగరంతో పాటు రెండో పెద్ద నగరం ఖర్కీవ్ పై భీకరంగా దాడులు చేస్తున్నారు. అయితే నిన్న కొంత సమయం దొరకడంతో చాలా మంది భారతీయులు సరిహద్దుల వైపు వెళ్లారు. ప్రస్తుతం ఎవరైతే తూర్పు ప్రాంతాల్లో ఉన్నారో.. వారి బంకర్లతో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.