ఉక్రెయిన్, రష్యా మధ్య ఇజ్రాయిల్ మధ్యవర్తిత్వం…!

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై మూడు వారాలకు చేరువ అవుతోంది. అయినా కూడా ఇప్పడప్పుడే యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బెలారస్ వేదికగా మూడు సార్లు రష్యా, ఉక్రెయిన్ అధికారులు చర్చలు జరిపారు. ఇరు పక్షాలు కూడా వారివారి డిమాండ్లపై గట్టిగా పట్టుబట్టడంతో చర్చలు విఫలం అయ్యాయి. ఇటీవల టర్కీ వేదికగా మరోసారి ఈ రెండు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం అయ్యారు. ఇవి కూడా పెద్దగా సత్ఫలితాలను ఇవ్వలేదు. దీంతో యథావిధిగా రష్యా, ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. 

మరోవైపు ఇజ్రాయిల్ ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ది కీవ్ ఇండిపెండెంట్ తెలియజేసింది. జెరూసలెంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలిసేందుకు ప్రతిపాదించాడు. ఇందు కోసం ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ ను మధ్యవర్తిగా వ్యవహరించాలని కోరినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఇటీవల ఉక్రెయిన్ మెలిటోపోల్ నగర మేయర్ ని రష్యా కిడ్నాప్ చేసింది. తమ మేయర్ ను విడిపేంచేందుకు సహాయం చేయాలని జెలన్ స్కీ, ఇజ్రాయిల్ ప్రధాని బెన్నెట్ ను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news