తెలంగాణలో రైతులకు శుభవార్త.. రేపటి నుంచి రైతు బంధు నిధులు

-

తెలంగాణలో రేపటి నుంచి పదో విడత రైతుబంధు నిధులు విడుదల కానున్నాయి. పదో విడత రైతుబంధుకు కింద ప్రభుత్వం 7వేల676 కోట్ల 61 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు సాయం అందనుంది. 70లక్షల54 వేల మంది రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి విడతల వారిగా నగదు జమకానుంది. ఎకరానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. గత వానాకాలం 65 లక్షల మంది అర్హులైన రైతులకు 7వేల434కోట్ల67 లక్షల రైతుబంధు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది.

Evening brief: KCR's office says he's unwell as Telangana CM skips PM Modi  event | Latest News India - Hindustan Times

ఇదిలా ఉంటే.. రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేయాలని రైతులు నినదిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుభీమా, సాగుకు ఉచిత కరంటు, సాగునీళ్లు ఇలా రైతుల హక్కుల కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు.

దేశాన్ని పాలిస్తున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన నరేంద్రమోడీ ఎనిమిదన్నరేళ్లయినా ఒక స్పష్టమయిన వ్యవసాయ విధానాన్ని రూపొందించ లేకపోయారంటూ విమర్శించారు. ఉపాధిహామీకి వ్యవసాయం అనుసంధానం, 60 ఏళ్లు నిండిన రైతులకు పింఛను, పంటలకు మద్దతుధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీల విషయంలో దేశ రైతాంగాన్ని దారుణంగా మోసంచేశారంటూ ఆరోపించారు. రైతుల విషయంలో పాలకుల దృక్పధం మారాలని తెలిపారు.

రేపటి నుండి పదో విడత రైతుబంధు నిధుల విడుదల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు నగదు జమ అవుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news