ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వరుసగా నాలుగో ఏడాది మొదటి విడతగా వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ విడుదల చేయనుంది సర్కార్.ఇందులో భాగంగానే నేడు… రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. మొదటి విడతగా రూ. 5,500లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… ఏలూరు జిల్లా గణపవరం నుంచి వర్చువల్గా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500ల రైతు భరోసా సాయం చేస్తోంది. ఈ నెల 31న కేంద్రం ఇవ్వనున్న పీఎం కిసాన్ నిధులు 2వేలు… మొత్తంగా నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగానే..నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైయస్.జగన్. ఏలూరు జిల్లా గణపవరం మండలం గణపవరంలో వైయస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కార్యక్రమంలో ఉదయం 10.10 గంటలకు పాల్గొంటారు సీఎం జగన్.