వీడియో వైరల్: బీచ్ దగ్గర పక్షిని రక్షించిన సచిన్.. ప్రశంసిస్తున్న నెటిజన్లు..!

-

సచిన్ టెండూల్కర్ ఉదారతనాన్ని చాటుకున్నారు. ఇండియన్ బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురించి కొత్తగా చెప్పేదేం వుంది. అద్భుతంగా ఎన్నో మ్యాచ్లు ఆది హిట్లు కొట్టాడు. అలానే సచిన్ టెండూల్కర్ కి వున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఎంతో మందికి సచిన్ అంటే ఇష్టం. సోషల్ మీడియా లో కూడా టెండూల్కర్ ని ఫాలో అవుతూ వుంటారు.

ఇది ఇలా ఉంటే శుక్రవారం నాడు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో ని షేర్ చేశారు సచిన్. ఆ వీడియోలో మనం టెండూల్కర్ ఒక పక్షిని పట్టుకోడానికి చూడొచ్చు. అదే విధంగా మరొక మనిషి వాటర్ బాటిల్ క్యాప్ తో పక్షి గొంతు లో నీళ్లు పోయడాన్ని చూడచ్చు.

 

ఇలా సచిన్ ఆ పక్షిని రక్షించాడు. అయితే సచిన్ టెండూల్కర్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి కొద్దిపాటి కేర్ మరియు ఎఫెక్షన్ చూపిస్తే ప్రపంచం మరింత బెటర్ గా ఉంటుందని క్యాప్షన్ కూడా రాశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

నెటిజన్లు సచిన్ టెండూల్కర్ చేసిన గొప్ప పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది అయితే గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 20 గంటల్లో ఈ వీడియోని 795 వేల మంది చూశారు. 573 కామెంట్లు వచ్చాయి 110 వేల మందికి పైగా నెటిజన్లు లైక్ చేశారు. మరి సచిన్ టెండూల్కర్ చేసిన ఆ మంచి పనిని మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sachin Tendulkar (@sachintendulkar)

Read more RELATED
Recommended to you

Latest news