Gargi: సాయి పల్లవి ‘గార్గి’.. ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది

-

టాలీవుడ్‌ హీరోయిన్ సాయిపల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపైన సాయి పల్లవి కనబడితే చాలు..ఆనందమే అనేంతలా సినీ అభిమానులపైన ఆమె ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సహజ నటనకు కేరాఫ్ గాఉంటూ తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది సాయిపల్లవి అలియాస్‌ లేడీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

అయితే గౌతమ్ రామచంద దర్శకత్వంలో సాధారణ కుటుంబ నేపథ్యంలో యువతి పాత్రలో ప్రేక్షకుల ముందుకు ఇటీవలే సాయిపల్లవి వచ్చిన సంగతి తెలిసిందే. న్యాయం కోసం పోరాడే యువతి పాత్రలో సాయి పల్లవి నటించిన తాజా చిత్రం ‘గార్గి’. ఈ సినిమా జూలై 15న విడుదల అయింది. అయితే..ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది ఇలా ఉండగా.. గార్గి సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ఆగస్టు 12 నుండి SonyLIVలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version