గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ తేలిపోయిన విషయం తెలిసిందే. ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ప్రతిపక్షంలో ఉంటూ వైసీపీపై పోరాటం చేసి బలపడాల్సిన టీడీపీ కేసులకు భయపడటం, అధికార వైసీపీ దెబ్బకు టీడీపీ నేతలు బయటకు రాలేదు. కొందరు ఓడిపోయిన నేతలు అడ్రెస్ లేకుండా వెళ్లిపోవడం, లేదా వేరే పార్టీల్లోకి జంప్ చేయడం చేశారు. దీని వల్ల చాలా స్థానాల్లో టీడీపీకి సరైన నాయకులు లేరు.
కానీ ఆ పరిస్తితులని చంద్రబాబు నిదానంగా చక్కదిద్దుకుంటు వచ్చారు. కేసులు పెట్టినా, అరెస్టులు చేసిన నేతలకు అండగా ఉంటూ వచ్చారు. దీంతో నేతలు బయటకొచ్చి పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు టీడీపీ పరిస్తితి మెరుగైంది. అయితే ఇంకా కొన్ని స్థానాల్లో టీడీపీకి నాయకులు లేరు. 175 స్థానాలు ఉంటే అందులో దాదాపు 35 స్థానాల్లో టీడీపీకి ఇంచార్జ్‌లు లేరు. ఉదాహరణకు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుని చూసుకుంటే అక్కడ పూతలపట్టు, చిత్తూరు, తంబళ్ళపల్లె లాంటి స్థానాల్లో ఇంచార్జ్‌లు లేరు. అటు పశ్చిమ గోదావరిలో చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు లాంటి స్థానాల్లో ఇంచార్జ్‌లు లేరు.
ఇదే అంశాన్ని తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. 35 స్థానాల్లో ఇంచార్జ్‌లని పెట్టలేకపోయావు..ఇంకా అధికారంలోకి వస్తానని బాబు ప్రగల్భాలు పలుకుంటున్నారని కామెంట్ చేశారు. విజయసాయి చెప్పింది నిజమే. టీడీపీకి కొన్ని స్థానాల్లో ఇంచార్జ్ లు లేరు. అయితే పరోక్షంగా సాయిరెడ్డి ఎగతాళి చేయడం వల్ల బాబు ఏమన్నా అలెర్ట్ అయ్యి..ఇంచార్జ్ లని పెట్టుకుంటారేమో చూడాలి.
అదే సమయంలో బాబు కాస్త తెలివిగానే కొన్ని చోట్ల ఇంచార్జ్ లని పెట్టలేదు. కొన్ని చోట్ల డమ్మీ ఇంచార్జ్ లని పెట్టారు. ఎందుకంటే జనసేనతో పొత్తు ఉంటే ఆ సీట్లని..ఆ పార్టీకి కేటాయించవచ్చు అని..మరి చూడాలి ఇకనైనా బాబు ఆ స్థానాలపై ఫోకస్ చేస్తారేమో.