CBI విచారణ ఓ డ్రామా..చంద్రబాబు కుట్రలే ఇవి అంటూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబునీ సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలని చూస్తున్న వారు వివేక హత్య కేసును వాడుకుంటున్నారు.. తెలుగు దేశం పార్టీ నాయకులు ఇదే అస్త్రం తో ముందుకి వెళ్తున్నారని విమర్శలు చేశారు.
దస్తగిరి కి సీఎం నుండి ప్రాణహాని ఉందని ఏళ్లో మీడియా ప్రచారం చేస్తుందివైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి వైసీపీ అండగా ఉంటుందని.. జగన్ కూడా అండగా ఉంటారని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ హడావిడి చేస్తోంది….కేసు ముగింపునకు వచ్చినట్లు చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు.సీబీఐ వాడుతున్న పదాలు, వాడుతున్న మాటలు చూస్తే టీడీపీ రాజకీయ అజెండా అర్ధం అవుతుందని వివరించారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని..కల్పిత కథను నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తారని తెలిపారు సజ్జల రామకృష్ణా రెడ్డి. హత్య చేసిన వ్యక్తిని అప్రూవర్ గా ఎలా మారుస్తారు? అని ప్రశ్నించారు. వాచ్ మ్యాన్ ప్రత్యక్ష సాక్షి గా వివరాలు చెప్పిన తర్వాత అప్రూవర్ అవసరం ఏం వచ్చింది?ఏ దర్యాప్తు సంస్థ ఇలా చేయదన్నారు. తానే హత్య చేశానని దస్తగిరి చెప్పిన తర్వాత ముందస్తు బెయిల్ కు సీబీఐ ఎలా ఒప్పుకుంది? దస్తగిరిని ఎందుకు అరెస్టు చేయటం లేదు? ఇది ఒప్పందంలో భాగం కాదా? అని నిలదీశారు సజ్జల రామకృష్ణారెడ్డి.