కాన్ వే: ధోనీ కీపర్ గా లేకుంటే గెలిచేవాళ్ళము కాదేమో !

-

నిన్న చెన్నై మరియు బెంగళూర్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు సరైన మజాను అందించింది. ఆఖరి బంతి వరకు ఊహించని విధంగా విజయం నీదా నాదా అన్నట్లుగా సాగింది. కానీ చివరికి ధోనీ సారథ్యం వహించిన చెన్నై విజయాన్ని అందుకుంది. ఇక చివరి వరకు గెలుపు కోసం పోరాడిన బెంగళూర్ టీమ్ కేవలం 8 పరుగుల తేడాతో ఓడిపోయి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. కాగా ఇందులో చెన్నై టీమ్ కెప్టెన్ ధోనీ పాత్ర ఎంత ఉందో చెప్పలేము, రెండు వికెట్లు కోల్పోయిన దశలో మాక్స్ వెల్ మరియు డుప్లిసిస్ లు చెన్నై ను ఒడించినంత పని చేశారు.

కానీ ధోనీ అందుకున్న చక్కని రెండు క్యాచ్ లకు బెంగళూర్ ఓటమి ఖరారు అయింది. ఈ విషయాన్ని చెన్నై ఓపెనింగ్ ఆటగాడు డివాన్ కాన్ వే మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో మేము గెలిచాము అంటే ప్రధాన కారణం ధోనీ… ఇతను కీపర్ గా ఉండడం వల్లనే మ్యాచ్ ను గెలిచాం నాతో అతన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఎంతో ఎత్తులో వచ్చిన రెండు క్యాచ్ లను రాత్రి పూట చాలా డెడికేటెడ్ గా పట్టుకుని ఉండకపోతే విజయం మాది కాకపోయేది అంటూ ధోనీని ప్రశంసలతో ముంచెత్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news