టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశం లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఏపీ లో కేసీఆర్ పార్టీ పెట్టుకోవచ్చు దానికి ఎవరి అనుమతి అవసరం లేదని.. ఏపీలోనే కాదు ఇండియా లో ఎక్కడైనా పెట్టుకొవచ్చని చురకలు అంటించారు సజ్జల. సిఎం కేసీఆర్ ఏదో అంటాడు.. చంద్రబాబు ఏదో అంటాడని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మరియు కేసీఆర్ కి ఎలాంటి ఒప్పందాలు, బంధాలు ఉన్నాయో తెలీదన్నారు. శ్రీశైలం నుండి అక్రమంగా నీళ్లు వాడేసుకుంటే కరెంటు కొరత ఎందుకు వస్తుంది..? అని ప్రశ్నించారు. విభజన వల్ల ఏపీ కి తీవ్ర నష్టం జరిగింది.. తెలంగాణకు బెనిఫిట్ జరిగిందని గుర్తు చేశారు. విభజన వల్ల, చంద్రబాబు వల్ల మన బతుకులు అంధకారంలో పడ్డాయని ఫైర్ అయ్యారు. ఇప్పుడు మన అదృష్టం జగన్ వంటి వ్యక్తి సీఎం అవ్వడమని పేర్కొన్నారు.
చంద్రబాబు వారం రోజుల క్రితం మొదలు పెట్టిన బూతు డ్రామాకు నిన్న తెర దించారని.. సంక్షేమ పాలన నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామా చేశారని మండిపడ్డారు. అబద్దాలు, డ్రామాలు, విధానాలను అలవోకగా మార్చడం చంద్రబాబు తెలిసిన ఏకైక విద్య అని.. చంద్రబాబు చేసే రాజకీయాలకు ప్రజలు.. ప్రజా జీవితాలు.. ప్రజల సమస్యలతో సంబంధమే ఉండదన్నారు.