సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోకండి : సజ్జనార్‌

-

యువత బైక్పై స్టంట్స్ వేస్తూ రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. యువకులు బైక్ వెనక అమ్మాయిలను కూర్చోబె ట్టుకుని బైక్ పై వెళ్తూ వింత వింత విన్యాసాలు చేస్తూ రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తున్నారు. ప్రేమ మైకంలో నేటి యువత కొట్టుమిట్టాడుతోంది.ఇక సోషల్ మీడియా వచ్చాక వారి విపరీత చర్యలు నషాళానికెక్కాయి. చేస్తున్నారో వారికే తెలియడం లేదు.కొన్ని సార్లు వారిని కని, పెంచి, పెద్దవాళ్ళని చేసిన తల్లిదండ్రులని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. లవ్ లో ఉన్నామనగానే సినిమా హీరోల్లాగా ఫీల్ అయిపోతున్నారు.దానికితోడు సోషల్ మీడియా తోడు ఒకటి తయారయ్యింది కదా. ఇంకేముంది కట్ చేస్తే వారి పైత్యం చూపిస్తూ ఒక్కోసారి బొక్కబోర్లా పడుతున్నారు.

VC Sajjanar appeals passengers to opt RTC services for safe  journey-Telangana Today

అయితే ఓ యువకుడు కూడా తన బైక్ పై ప్రేయసిని కూర్చోబెట్టుకొని స్టంట్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా జారి ఇద్దరు రోడ్డు మీద పడిపోయారు. పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చెక్కర్లు కొడుతోంది.తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఆ వీడియోను షేర్ చేస్తూ… యువతీయువకులారా.. సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోకండి. లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ అసలే చేయకండి. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను మనో వేదనకు గురిచేయకండి.. అంటూ కొటేషన్ రాసుకొచ్చారు.. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news