బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి….ఏపీ రాజకీయాల్లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉన్న యువ నాయకుడు. అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో ఎదిగిన నేత. తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా రాజకీయాల్లోకి వచ్చినా సరే…ఆ తర్వాత ఆయనతో విభేదించి వైసీపీలో చేరి కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడు అయ్యారు.
అలాగే నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉంటూ…అక్కడ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో నందికొట్కూరులో వైసీపీకి భారీ మెజారిటీ రావడంలో బైరెడ్డి కృషి ఉందని చెప్పొచ్చు.
అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టిడిపి పార్టీలో చేరతారని… సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే నారా లోకేష్ తో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి… సమావేశమైనట్లు కూడా తెలుస్తోంది. శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలను తాను చూసుకుంటానని నారా లోకేష్‌కు సిద్ధార్థ రెడ్డి చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టిడిపి పార్టీ లోకి వస్తే… నందికొట్కూరు నియోజకవర్గం లోని టీడీపీ నాయకులు వైసీపీ లోకి వెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బైరెడ్డి టిడిపి పార్టీలో చేరుతారా ? లేదో ? తెలియాల్సి ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.