“లిప్ కిస్” సీన్: ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్…

-

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హిందీ లో ఈ షో జరుగుతూ ఉంది, ఈ షోకు హోస్ట్ గా ఖాన్ త్రయంలో ఒకరైన సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న జాద్ హదీద్ మరియు ఆకాంక్ష ల జోడీ లిప్ లాక్ సీన్ తో సంచలనం సృష్టించారు. ఈ ఎపిసోడ్ ను చూసిన ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడినట్లు ఆ ఎపిసోడ్ కు వచ్చిన కామెంట్ లలో తెలుసుకున్న షో నిర్వాహకులు ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది. కాగా నిన్న ఆదివారం కావడం వలన సల్మాన్ ఖాన్ వచ్చి ఈ జంటను నిలబెట్టి ఫుల్ గా క్లాస్ ఇచ్చాడట. ఇక్కడకు మీరు వచ్చింది సినిమాలో లేదా వెబ్ సిరీస్ లో చేయడానికి కాదు.. ఇది ప్రజలంతా చూస్తున్న ఒక రియాలిటీ షో అని మర్చిపోకండి, ఇంకోసారి ఇది పునరావృతం అయితే ఇద్దరూ ఎలిమినేట్ అవుతారు అంటూ వార్నింగ్ ఇచ్చాడట.

అనంతరం ప్రేక్షకులకు ఈ లిప్ లాక్ సీన్ కు బాధ్యత వహిస్తూ షో తరపున అందరికీ క్షమాపణ చెప్పాడు సల్మాన్ ఖాన్.

Read more RELATED
Recommended to you

Latest news