వాస్తు: ఉప్పు,పసుపు అప్పుగా ఇవ్వకూడదు? ఎందుకో తెలుసా?

-

భారతీయులకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. కొన్ని వస్తువులను బదులు ఇవ్వకూడదని, కొన్ని వస్తువులను కొన్ని వారాల్లో మాత్రమే ఇవ్వాలని అంటారు.అలాగే ఇంట్లో నిత్యావసరాలైన వస్తువుల విషయంలోనూ కొన్నిసెంటిమెంట్లు ఉంటాయి. వాటిని అప్పుగా ఇవ్వడం.. చేతికి అందించడం లాంటివి చేయరు..ఎందుకు? అలా చేస్తే ఏదైనా సమస్యలు వస్తాయా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కూరల్లో పసుపు, ఉప్పు చాలా ముఖ్యమైన ఐటమ్స్. ప్రతి వంటింట్లో ఉప్పు, పసుపు రెండు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఉప్పు లేకపోతే కూరకు రుచి ఉండదు, పసుపు లేకపోతే ఆహార పదార్ధాలకు రంగు ఉండదు. అంతేకాదు ఈ రెండింతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. కానీ ఈ రెండింటి విషయంలో హిందువులకు చాలా సెంటిమెంట్లు ఉన్నాయి..

ఇవి ఎక్కడ్తెతే కొరత లేకుండా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. వాస్తు శాస్త్రంలో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అంటారు. ముఖ్యంగా ఉప్పు, పసుపును ఎప్పుడూ చేతికి అందించడం కానీ.. దానం చేయడం కాని చేయకూడదు అంటారు..వీటిని దానం ఇవ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ రెండు వస్తువులను ఎవరికైనా ఇస్తే.. ఇచ్చిన వారితో పాటు.. తీసుకున్న వారి ఇంట్లో నష్టాలు పెరుగుతాయి.. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు తెలెత్తే అవకాశం ఉందని.. అనాథిగా నమ్ముతూ వస్తున్నారు కొందరు..

సూర్యాస్తమయం తర్వాత మీరు ఇరుగుపొరుగు వారికి ఉప్పును అప్పుగా ఇస్తే.. ఆర్థికంగా చాలా నష్టపోతారని వస్తు పండితులు చెబుతున్నారు. వంటగదిలో ఉప్పు అయినపోయినా సరే మీరు ఇబ్బందులు పడతారంట. అందుకే కిచెన్ లో ఎప్పుడూ ఉప్పు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలనిన సూచిస్తున్నారు..తప్పని సరి పరిస్థితిల్లో ఒకవేళ ఎవరికైనా ఉప్పు ఇవ్వాలనుకుంటే కొంత డబ్బు తీసుకుని ఇవ్వాలని చెబుతున్నారు. హిందువులు పసుపును చాలా పవిత్రంగా భావిస్తారు. ప్రతి శుభకార్యంలోనూ పసుపును వాడుతారు. పసుపను అప్పుగా ఇస్తే ఆర్థిక ఇబ్బందులు, వివాహానికి ఆటంకాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.ఇకపోతే వెల్లుల్లి, ఆవు పాలను కూడా సాయంత్రం పూట దానం చెయ్యకూడదు..మనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి..ఇవి గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version