క్రేజీ అప్డేట్ : త్వరలోనే తాప్సీ-సమంత సినిమా !

-

సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న నటి మణులలో సమంతా కూడా ఒకరు . ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సమంత నటించిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

అంతేకాదు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ కి స్టెప్పులేసి దేశం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సమంత మంచి ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇది ఇలా ఉండగా త్వరలోనే సమంత.. హీరోయిన్ తాప్సీ తో ఓ సినిమా తీయనుంది.

ఈ విషయాన్ని స్వయంగా తాప్సి ఇంటర్వ్యూలో ప్రకటించింది.”సమంత నేను కలిసి పని చేయనున్నం. ఈ ప్రాజెక్టు త్వరలో ప్రకటిస్తాం. అందులో తన ప్రధాన పాత్ర పోషిస్తుంది. నేను నిర్మాతగా వ్యవహరిస్తా. ఒకవేళ దాంట్లో నేను చేయగలిగే భాగం ఏదైనా ఉంటే కచ్చితంగా చేస్తాను. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ నిర్మించడం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నాను” అని తాప్సి పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version