హృతిక్ రోషన్ నాకు నచ్చడు.. సమంత కామెంట్స్ వైరల్..!

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. ఇటీవల బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్ షో’కు గెస్ట్ గా హాజరై పలు విషయాలు చెప్పింది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తో షోకు వచ్చిన సమంత..తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు విషయాలు షేర్ చేసింది. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆమె కామెంట్స్ పట్ల సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

గతంలో బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ పైన సమంత చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసి సమంత కామెంట్స్ పైన స్పందిస్తున్నారు. సమంత తన మాజీ భర్త నాగచైతన్యతో కలిసి నటించిన ‘ఏ మాయ చేశావే’ చిత్ర విశేషాలు పంచుకునే క్రమంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్ పైన కామెంట్స్ చేసింది.

అందరికీ హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమని, కానీ, తనకు హృతిక్ నచ్చడని చెప్పింది. ఈ విషయం చెప్పినందుకు తనను అందరూ చంపేస్తారని, అయినప్పటికీ తాను తన అభిప్రాయాన్ని చెప్తున్నానని సమంత అంది. ఈ కామెంట్స్ పైన సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. అభిమానులు, సినీ లవర్స్, మీడియా హృతిక్ రోషన్ ను ‘‘గ్రీక్ గాడ్’’ , సూపర్ హీరో అని పొగిడేస్తుంటే..సమంత ఎందుకలా అన్నదో అర్థం కాలేదని చర్చించుకుంటున్నారు.

ఇక అప్పట్లో ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ వీడియో సమంత చాలా డిఫరెంట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో సమంత వాయిస్ కూడా స్పష్టంగా లేదని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక..సమంత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ పిక్చర్ లో ‘ఊ అంటావా మావా..’ అనే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి అందరికీ విదితమే. సమంత నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ త్వరలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news