సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ తన సరికొత్త ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో శాంసంగ్ గెలక్సీ M33 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. అమెజాన్ ప్లాట్ ఫాంపై సేల్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ రోజు మనం ఈ ఫోన్ హైలెట్స్, కెమేరా క్వాలీటీ చూద్దాం.
Samsung Galaxy M33 5G హైలెట్స్;
Galaxy M33 5G భారత మార్కెట్లో ఎంత ఉంటుంది అనేది వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. కానీ, అమెజాన్ వెబ్ సైట్లో ఈ ఫోన్ విక్రయానికి సంబంధించి డేట్ మాత్రమే ధ్రువీకరించారు..
Amazon వెబ్సైట్ లో ఇచ్చినదాని ప్రకారం.. Samsung Galaxy M33 5G ఫోన్ కిందిభాగంలో 5nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అందిస్తోంది.
స్మార్ట్‌ఫోన్ రెండు RAM, స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో వచ్చింది. 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్లలో రానుంది.
Samsung Galaxy M33 5G 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 6,000mAh బ్యాటరీతో రానుందని అమెజాన్ లిస్టులో కనిపిస్తోంది.
Samsung Galaxy M33 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల LCD డిస్ప్లే అందిస్తున్నారు. శాంసంగ్ నుంచి రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందిస్తోంది.
Samsung Galaxy M33 5G ఫోన్ కు సంబంధించి స్పెసిఫికేషన్లు ఈ నెల ప్రారంభంలోనే టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి.
Samsung Galaxy A13, Samsung Galaxy A23, Samsung Galaxy M23 5Gలతో ఉన్న ఫీచర్సే..Samsung Galaxy M33 5G కూడా అదే ఫీచర్లు ఉన్నాయి.
Galaxy M33 5G భారతీయ మోడల్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత One UI 4.1పై రన్ అవుతుందట..
గెలాక్సీ M33 5G క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. స్మార్ట్‌ఫోన్‌లో 50-MP ప్రైమరీ సెన్సార్, 5-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, రెండు 2-MP మాక్రో, డెప్త్ కెమెరాలు ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం 8-MP కెమెరాను కూడా కలిగి ఉన్నాయని భావిస్తున్నారు. టిప్‌స్టర్ ప్రకారం.. హ్యాండ్‌సెట్‌లో 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ కొనాలనే ఆసక్తి ఉన్న వినియోగదారులు.. అమేజాన్ లో నోటిఫై ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. సేల్స్ ప్రారంభమైనప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది.