ఉక్రెయిన్ పై రష్యా దాడి అమెరికన్లు భయపెడుతోంది. ఈ యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి పరిస్థితులకు దారి తీయొచ్చని భయపడుతున్నారు. తాజాగా అసోసియేటెడ్ ప్రెస్- NORC సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ ఓ సర్వేలో అమెరికన్ల భయాలు బహిర్గతం అయ్యాయి. రష్యా నేరుగా అణ్వాయుధాలతో యూఎస్ ను లక్ష్యంగా చేసుకుంటుందని సగం మంది అమెరికన్లు చాలా ఆందోళన చెందుతున్నారని…. ప్రతీ 10 మందిలో ముగ్గురు ఎంతో కొంత ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే 10 మంది అమెరికన్లలో 9 మంది ఉక్రెయిన్ పై రష్యా అణ్వాయుధాలు ఉపయోగిస్తుందని ఆందోళన చెందుతున్నారు. వీరిలో 6 మంది మాత్రం అధికంగా భయపడుతున్నారు. రష్యా దురాక్రమణ ప్రపంచంలో ఎక్కడైనా అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం పెరిగిందని 71 శాతం అమెరికన్లు భావిస్తున్నారు. మరోవైపు ఉత్తరకొరియా నుంచి పొంచి ఉన్న అణ్వాయుధాల నుంచి అమెరికాకు ప్రమాదం ఉందని 51 మంది అమెరికన్లు భావిాస్తున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో.. రష్యా యూఎస్ ను యుద్ధంలోకి లాగవచ్చని చాలా అందోళన చెందుతున్నారని సర్వేలో తెలింది.