తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టేందుకు స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య తన వంతు ప్రయత్నాలు చేపడుతున్నారు. ఈ ఆరోపణలు చేపట్టిన జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్యతో ఎమ్మెల్యే రాజయ్య. ఆయన నేరుగా సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. అధిష్టానం నిర్ణయం మేరకు, నవ్య భర్త ప్రవీణ్ ఆహ్వానం మేరకు తాను ఇక్కడికి వచ్చినట్టుగా రాజయ్య వెల్లడించారు. గత నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగింకగా వేధిస్తున్నాడంటూ నవ్య ఆరోపించారు. ఈ క్రమంలో నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.
తనకు ఎమ్మెల్యే రాజయ్యే వల్లే తనకు టికెట్ వచ్చిందని, సర్పంచ్ అయ్యానని జానకీపురం సర్పంచ్ నవ్య తెలిపారు. తమ గ్రామాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకున్నారని, కానీ ఆయన వల్ల గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. తన గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారో ఎమ్మెల్యే రాజయ్య మీడియా ముఖంగా చెప్పాలని కోరారు సర్పంచ్ నవ్య. మహిళలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని నవ్య అన్నారు. తప్పు చేసిన వారిని క్షమిస్తానని చెప్పారు. అయితే ఆమె రాజయ్య వేధింపులపై మాత్రం నేరుగా స్పందించలేదు. కానీ రాజయ్య పక్కన ఉండగానే ఆయనపై నవ్య తీవ్ర ఆరోపణలు చేపట్టారు. తాను చేసిన ప్రతి ఆరోపణ నిజం అని నవ్య స్పష్ట పరిచింది.