ఆన్ లైన్ మార్కెట్ లో ఫ్లిప్ కార్ట్ తెలియని వారుండరు. నిత్యావసర సరుకు దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుద దాకా వివిధ వస్తువును విక్రయించే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ. ఇలాంటి ఫ్లిప్ కార్ట్ ఆరోగ్య సేవలు అందించేందుకు ఆరోగ్య రంగంలోకి అడుగు పెట్టనుంది. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం ’సస్తా సుందర్ మార్కెట్ ప్లేస్‘ అనే ఆన్ లైన్ ఫార్మసీ సంస్థ నుంచి మెజారీటి వాటాను కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఆ సంస్థతో పలు ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు వెల్లడించింది. ’ఫ్లిప్ కార్ట్ హెల్త్ ప్లస్‘ పేరుతో త్వరలో ఫార్మా సేవలను అందుబాటులోకి తెనున్నట్లు వెల్లడించింది.
సస్తాసుందర్.కామ్.. డిజిటల్ హెల్త్‌కేర్, ఫార్మసీ రంగానికి సంబంధించి 490 ఫార్మసీల నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ‘ఫ్లిప్‌కార్ట్ హెల్త్ +’, ఇప్పుడు సస్తాసుందర్ సహా ఫ్లిప్‌కార్ట్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని ఈ-ఫార్మసీ రంగంలో మెరుగైన సేవలు అందించనుందని సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో ఈ-డయాగ్నెస్టిక్స్, ఈ-కన్సల్టేషన్ల సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది.